అక్కినేనివారి మనవాడి గా మొదట్లో విజయాలను అందుకున్నారు హీరో సుశాంత్ . కానీ దాని తరువాత ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . చాలా కాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్సకత్వంలో రూపొందుతున్న చిలసౌ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమా టీజర్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది . ఇప్పుడు ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేసే పనిలో ఉన్నారు .
కాగా సుశాంత్ మరో కొత్త సినిమాలో నటించబోతున్నారని , దానికి “గట్టిగా కొడతా” అనే టైటిల్ ను పెట్టినట్టు ఓ ఫేక్ పోస్టర్ దాంతో పాటు ఈ పోస్టర్ పై వెకిలి కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . దీని పై సుశాంత్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా స్పందిస్తూ ‘‘ట్రోలింగ్ చేయడం వేరు. కానీ ఫేక్ న్యూస్ క్రియేట్‌చేసి మరీ ట్రోల్ చేయడమేంటో! ఏదేమైనా నాపై ధ్యాస ఉంచిన అందరికీ ధన్యవాధాలు’’ అని రాసుకొచ్చారు .
It’s one thing to troll…
But to create fake news and then try to troll 👏 (slow clap)
Thanks for all the attention 😎— Sushanth A (@iamSushanthA) June 7, 2018