సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సమ్మోహనం’

502

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘సమ్మోహనం’ సినిమా రూపొందింది. సుధీర్ బాబు .. అదితీరావు జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. దాంతో విడుదలకి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి.

ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా ఇంద్రగంటికి గల పేరు కూడా ఈ సినిమా పట్ల క్రేజ్ పెరగడానికి కారణమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here