చైనా మొబైల్‌ దిగ్గజ కంపెనీ షావోమి రెడ్‌ మీ వై సిరీస్‌లో మరో నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పటికే వై1 డివైస్‌ అమ్మకాలతో ఉత్సాహంగా  ఉన్న కంపెనీ తాజాగా ఫైండ్‌​ యువర్‌ సెల్పీ అంటూ వై 2 స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది.  3జీబీ/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ/64జీబీ స్టోరేజ్‌  వేరియంట్లలో, గోల్డ్, డార్క్ గ్రే , రోజ్ గోల్డ్ కలర్స్‌లో  ఈ డివైస్‌లు లభ్యం. వీటి ధరలు వరుసగా 9,999, 12,999 రూపాయలుగా ఉండనున్నాయి.  రెడ్‌మీ  వై1 కంటే   ఫేస్‌అన్‌లాక్‌ మోడ్‌, మియూఐ 9.5 అప్‌డేట్‌ ఫీచర్లతో 37 శాతం మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది.  సెల్ఫీ సిరీస్‌లో  భాగంగా  వై1 సెలబ్రిటీ స్పెషల్‌గా లాంచ్‌ చేసింది. తాజాగా వై2 కూడా  బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.   జూన్‌12 మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు మొదలు కానున్నాయి.

రెడ్‌మి వై 2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో
720×1440  రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగెన్ 625 ప్రాసెసర్
3జీబీ/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ/64 జీబీ స్టోరేజ్‌
స్టోరేజ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
12+5 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్ సెల్పీ ఏఐ కెమెరా
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments