సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంటోంది . అయితే ఈ సినిమాను తమ రాష్ట్రంలో విడుదల ఇప్పట్లో చేయనివ్వమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నే స్వయంగా ప్రకటించడం , దానికి బదులుగా రజనీకాంత్ చిత్రం విడుదలకు సహకరించాలంటూ కన్నడ భాషలో కుమారస్వామి కి సందేశం పంపటం జరిగింది . ఇప్పుడు మళ్ళీ ఈ వివాదం పై తలైవా రజనీకాంత్ స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీమ్ కోర్టు తీర్పు మేరకు కావేరీ యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే తాను గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని కోరానని ,అంతకు మించి తాను ఏదీ మాట్లాడలేదని , తాను అన్న దాంట్లో తప్పేంటో తెలియడంలేదని అన్నారు . కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతీయాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాను కర్ణాటకలో నిలిపివేయడం మంచి కాదని రజనీ అన్నారు . సినిమా ప్రశాంతంగా విడుదలై , ప్రశాంతంగా ప్రదర్శింపబడేలా ముఖ్యమంత్రి కుమారస్వామి చోరవ తీసుకోవాలన్నారు . ఈ సందర్భంగా కన్నడ సంఘాలను ఉద్దేశించి సినిమా చూడాలనుకునేవారిని అడ్డుకోవద్దని అన్నారు . ఇప్పటికే ఈ వివాదం విషయం లో రాజనీకు మద్దతుగా మరో తమిళ్ అగ్ర హీరో , మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ నిలిచిన విషయం తెలిసినదే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments