కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోనుందని , అందువల్లనే కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ఏ ఐ సి సి అధినేత రాహుల్ గాంధీ చాలా సఖ్యతగా మెలిగారన్న వార్తలు వచ్చాయి . కానీ ఈ విషయం పై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి ఆ వార్తలలో వాస్తవం లేదని , ఒకవేళ అదే కనుక జరిగితే తాను ఉరి వేసుకుంటానని ఆనందం మనకు తెలిసిందే . ఇప్పుడు ఈ విషయం పై కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్పందించారు .

ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న వార్తలు అవాస్తవమని , రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగాన్ పోటీచేస్తుందని స్పష్టం చేశారు . ఇంకా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయడంపై చర్చ అవసరమని అన్నారు . ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేస్తున్న నవనిర్మాణ దీక్షలు కేవలం బూటకమని కొట్టి పారేశారు . ప్రత్యేక హోదా సాధించే అర్హత కేవలం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే ఉందని , 2019 లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రత్యేకహోదా ఫైల్ పై సంతకం చేస్తామని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments