చంద్రబాబు గారి బాషలో అవినీతికి నిర్వచనం ఏమిటో …?

0
160

‘జనసేన’ పోరాట యాత్రలో భాగంగా పాడేరులో ఈరోజు పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తన పరిపాలనలో అవినీతి ఎక్కడ ఉందని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, విశాఖపట్టణం జిల్లాలోని పాడేరు దగ్గర ఉన్న గూడ గ్రామానికి ఆయన ఒకసారి వచ్చి చూస్తే అవినీతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు., గూడ గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఓ నాయకుడే అక్రమ మైనింగ్ చేస్తూ రూ.9 కోట్లు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ‘బాంబులు పెట్టి కొండలు పేల్చి.. ప్రకృతిని విధ్వంసం చేస్తుండటం అవినీతి కాదా? మరి, ముఖ్యమంత్రి గారి భాషలో అవినీతికి నిర్వచనం ఏమిటో చెప్పాలి?’

ఇంకా మాట్లాడుతూ ఇదే గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఒకే ఒక్క ఊట బావి ఉందని, దాని పక్కనే మైనింగ్ చేస్తున్నారు., వాటి నుంచే వచ్చే విషపదార్థాలు ఆ నీటిలో కలిసిపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా కొండలు తవ్వేస్తున్నారు! ఇది అవినీతి కాదా? గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు కనీసం రోడ్లు కూడా లేవు. కానీ, పంచాయతీరాజ్ నిధుల నుంచి చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ కేంద్రాలకు రోడ్లు వేయించుకున్నారు… మంత్రి నారా లోకేశ్ తన పంచాయతీ శాఖ రోడ్లను ‘హెరిటేజ్’ కు వేయించుకున్నారు. ఇక, ఐటీ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో విశాఖపట్టణంలో చెబుతా! మన్యంలో గ్రానైట్ దోపిడీయే ఈవిధంగా ఉంటే బాక్సైట్ ఇక ఏవిధంగా ఉంటుందో? ముఖ్యమంత్రి 2050 విజన్ అంటున్నారు. ఇలాగే, అక్రమంగా కొండలు తవ్వితే 2050 నాటికి అరకు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి! ఒక పథకం ప్రకారమే గిరిజన ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. కేంద్రం కొత్తగా ఓ చట్టం చేయబోతోంది. ఈ చట్టం ద్వారా అటమీభూములపై గిరజనులకు హక్కులు లేకుండా చేయడంతోపాటు, గిరజనేతరులకీ హక్కులు ఇవ్వబోతున్నారు. దీనిని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదు? వైసీపీ వాళ్లు ఎందుకు మాట్లాడట్లేదు?’ అని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here