జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా పాడేరు లో రోడ్ షో నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు . రోడ్ షో లో పవన్ మాట్లాడుతూ గిరిజన యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకే యువత పక్కదారి పడుతోందని , ఐటీడీఎ ఉపాధి మార్గాలు చూపకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు . ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలను చూసి కడుపుమండడం వల్లనే జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు . ఇంకా మాల్తాడుతూ హుకుంపేట మండలం గూడలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ప్రభుత్వం ఆ విషయాలను పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments