తెలుగునాట ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . ఇప్పటికే సావిత్రి బయోపిక్ మహానటి విడుదలై ఘన విజయాన్ని సాధించింది . ఇప్పుడు ఎన్టీఆర్ , వైఎస్ఆర్ , కాంతారావు , ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి , కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లు  లైన్ లో ఉన్నాయి . స్టువర్టపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో రానా నటించనున్నాడని కొన్ని రోజుల క్రిందట వార్తలు వచ్చాయి . అయితే తను వేరే సినిమాలలో బిజీగా ఉండడం వలన రానా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట . ఆయన తప్పుకోవడంతో దర్శక నిర్మాతలు నాని ని సంప్రదించడం ఆయన వెంటనే ఓకే చెప్పెసినట్టు సమాచారం . ఈ సినిమాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాకు దర్సకత్వం వహించిన వంశీకృష్ణ దర్సకత్వం వహించనున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments