చార్జీంగ్‌.. హెడ్‌సెట్లో పాటలు.. షాక్‌

0
208

మొబైల్‌ ఫోన్‌కు చార్జీంగ్‌ పెట్టి, హెడ్‌ సెట్లో పాటలు వింటున్న యువకుడు షాక్‌ కొట్టి చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం హర్యానా రాష్ట్రంలోని యముననగర్‌ జిల్లా పాండ్యో గ్రామంలో చోటు చేసుకుంది. తాత్‌సింగ్‌ (22) అనే యువకుడు తన ఇంట్లో ఫోన్‌కు చార్జీంగ్‌ పెట్టి అలానే హెడ్‌ఫోన్‌ పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్‌ సరఫరా లేదు. కరెంటు వచ్చే సమయానికి చార్జీంగ్‌ కేబుల్‌ అలానే ఉండడంతో తాత్‌సింగ్‌ కరెంటు షాక్‌కు గురైయ్యాడు. దాంతో ఇంట్లో వాళ్లు అతడ్ని యముననగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here