గతంలో పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి లేదని నేను వ్యాఖ్యలు చేశాను కానీ, ఈరోజు ఆయన గురించి   నిష్పక్షపాతంగా చెబుతున్నాపవన్ కు చిత్తశుద్ధి ఉందని ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘పవన్ కు చిత్తశుద్ధి కలగడానికి ఒక బలమైన కారణం సీఎం కేసీఆరే. ఇటీవల కేసీఆర్ ని పవన్ కలిసినప్పుడు.. పవన్ లో ఉద్యమ స్ఫూర్తిని ఆయన నింపారు. రాష్ట్ర ప్రజలతో పవన్ మమేకమయ్యేలా కేసీఆర్ చేశారు. యావత్తు యువత పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓ ప్రభంజనానికి నాంది పలుకుతారేమో! ఒక  సైనికుడిలా ప్రజల కోసం పని చేసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటేందుకు వచ్చిన మరో అల్లూరి సీతారామరాజు పవన్ కల్యాణ్ అని ప్రజలు అనుకుంటున్నారు. కచ్చితంగా, పవన్ దశాదిశా మంచి మార్గంలో ఉంటుందని మనం భావించవచ్చు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ శక్తిలా మారి, రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురాగలుగుతారనే నమ్మకం నాకు ఉంది’ అని చెప్పుకొచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments