పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్‌) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్‌ కమిటీలో టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్‌ కమిటీని పునర్‌ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కూడా ఉన్నారు. ఎంపీ ల్యాడ్‌ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments