విజయవాడలో జరిగిన సిపీఐ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేత రామకృష్ణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని అన్నారు . చంద్రబాబు తనకున్న అసంతృప్తిని బీజేపీ పై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప , తన పరిపాలన ఏ విధంగా ఉందొ ఆలోచింధడం లేదన్నారు . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీల రాజీనామాల గురుంచి మాట్లాడుతూ అవి నిజమైన రాజీనామాలు కావని , “రాజీ-డ్రామాలు” అని వ్యాఖ్యానించారు . మోదీ అంటే చంద్రబాబు , జగన్ కు భయమని వారిద్దరూ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారన్నారు . ఇంకా మాల్తాడుతూ ఈ నెల 20 న విజయవాడలో సిపీఐ , సిపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments