ప్రయాణికురాలికి మద్దతుగా కోర్టు సంచలన తీర్పు …

581

కన్స్యూమర్ కోర్టు ఒక ప్రయాణికురాలికి మద్దతుగా నిలిచి రావలసిన దానికంటే ఎక్కువ పరిహారం వచ్చేలా చేసింది . వివరాలలోకి వెళితే గతేడాది మే నెలలో శైలేష్ భాయ్ , మీనాబెన్ భగత్ జమ్ముతావి ఎక్ష్ప్రెస్స్ లో 2 టైర్ ఏసీ లో ప్రయాణం చేస్తుండగా మధుర , డిల్లీ స్టేషన్ల మధ్య హ్యాండ్ బ్యాగు చోరీకి గురయ్యింది . దీనిపై వారు రైల్వే కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో జామ్ నగర్ లోని వినియోగదారుల కోర్టులో కేసు వేశారు .

ప్రయాణికుల వాదనను రైల్వే విబెధించింది . వారు క్యారీ చేసిన లగేజీకి బుకింగ్ లేదని , ఎటువంటి చార్జీలు చెల్లించలేదని , కావున పోయిన వాటికి తమకు ఎటువంటి బాధ్యత లేదని స్పష్తం చేసింది . అయితే ఈ వాదనతో కోర్టు విభేదించి రైల్వే రిజర్వేషన్ కోచ్ లోకి రిజర్వేషన్ లేని వారు ప్రవేశించకుండా చూడాల్సిన బాధ్యత టీటీపైనే ఉందని స్పష్టం చేసింది . దీనితో ఆగకుండా పోయిన వస్తువుల విలువ రూ . 2 లక్షలు ఉండగా రైల్వే ప్రయాణికురాలికి రూ . 5 లక్షలు ఇవ్వవలసినదిగా సంచలన తీర్పు వెల్లడించింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here