సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతోంది . ఈ చిత్రానికి సంబంధించి ఈ నెల 9 న ఆడియో విడుదల వేడుక నిర్వహించనున్నారు . ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్న విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ విషయం పై ఓ చర్చ నడుస్తోంది . మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ చరణ్ తేజ్ , అల్లు అర్జున్ బాగా స్థిరపడి సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు . వరుణ్ తేజ్ కూడా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు . ఇక మిగిలింది సాయి ధరమ్ తేజ్ ,ఈయన మాత్రం వరుస ఫ్లాపులతో పరాజయం పాలవుతూ హిట్ ను అందుకోలేకపోతున్నారు . అందుకోసం మేనమామలైన చిరంజీవి , పవన్ సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను గాడిలో పెట్టేందుకు మంచి కధ సిద్ధం చేయమని అల్లు అరవింద్ తో చెప్పారట . దాంతో అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్లో తేజు తో ఒక సినిమా చేయనున్నారని సమాచారం . తేజూ సినిమా తేజ్ ఐ లవ్ యు కు మంచి ప్రమోషన్ ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి ఆడియో లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments