ఏపీలో ఇటీవల వరుసగా పడవ ప్రమాదాలు చోటుచేసుకొని అనేకమంది ప్రాణాలు కోల్పోయారు . ఇప్పుడు తాజా పులికాట్ సరస్సులో తృటిలో పెను ప్రమాదం తప్పింది . వివరాలలోకి వెళితే ఇరకం దీవిలో జరుగుతున్న పోనీయమ్మ రధోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు . ఇరకం – భీములపాలెం రేవుకు మధ్య భక్తులను తరలించేందుకు మత్యకారులు పడవలను వాడుతున్నారు . ఈ సందర్భంలో భీములపాలెం కు 30 మంది తో తిరిగి వస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది . భారీగా భక్తులు ఎక్కడంతో పడవ ఒకవైపుకు ఒరిగి పడవలోకి నీరు చేరడం ప్రారంభమయ్యింది . రేవు సమీపంలోకి వచ్చేసరికి పడవ పూర్తిగా మునిగిపోయింది . అయితే పడవ ఆ సమయానికే ఒడ్డుకు సమీపించడంతో కింద నెలకు పడవ అనుకుంది . దీన్ని గమనించి ఇతర పడవల నిర్వాహకులు వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి, అందరినీ ఒడ్డుకు తరలించారు. ఇదే ప్రమాదం సరస్సు మధ్యలో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. జరిగిన ఘటనతో భక్తులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here