గడిచిన నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం మంచిని చెడుగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని, వారి ఆటలు సాగబోవన్నారు.  ముఖ్యమంత్రి ఈ రోజు నవనిర్మాణ దీక్షపై అధికారులపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు అందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా చూశామని, దాంతో అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం నెలకొందని చెప్పారు. 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పొత్తులకు అవకాశం లేదన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments