భారత దేశ అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ తన బాల్య స్నేహితురాలు శ్లోకాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 30న వీరి ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ తో కలసి నీతా అంబానీ ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలను నిర్వహించి, ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన తొలి ఆహ్వానపత్రికను ఆయనకు అందించారు. డిసెంబర్ లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం.
ఆహ్వానపత్రికను అందించిన నీతా అంబానీ
Subscribe
Login
0 Comments