ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్…

0
200

ఎయిర్ ఇండియా ఉన్నట్టుండి లగేజీ చార్జీలను పెంచి ప్రయాణికులకు షాకిచ్చింది. దేశీయ రూట్లలో ప్రయాణాలకు ప్రతి అదనపు కిలో బరువుపై రూ.100 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ అదనపు లగేజీ ప్రతీ కిలోపై రూ.400ను చార్జ్ చేస్తోంది. ఇక మీదట అదనపు లగేజీ తీసుకెళ్లే వారు ప్రతీ కిలో బరువుకు రూ.500 చెల్లించుకోవాల్సి వస్తుంది. సవరించిన చార్జీలు ఎయిర్ ఇండియా నిర్వహించే అన్ని ఫ్లయిట్లలో జూన్ 11 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎకానమీ తరగతి ప్రయాణికులు లగేజీ చార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ, ఇతర తరగతుల వారు 12 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణికులపై జీఎస్టీ చార్జీలు ఉండవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here