పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీల గురుంచి మీడియాతో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ పదవులకు ఇంకా 14 నెలల గడువు ఉన్నా రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేసిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని అన్నారు . ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ చెందినా ఐదుగురు ఎంపీలు ఎలాంటి భయం లేకుండా రాజీనామాలు సమర్పించారు , అదే విధంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భయపడ్డారని విమర్శించారు . ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు .

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వారు ఉప ఎన్నికలలో పోటీ చేస్తే బుద్ధి ఉన్న పార్టీ ఏదీ ప్రత్యర్దులుగా బరిలోకి నిలపదని అన్నారు , ఒకవేళ అభ్యర్ధులను దింపితే వారు ప్రత్యేక హోదా అనుకూలమా ? లేక వ్యతిరేకమా ? అనే ప్రశ్న వస్తుందని అన్నారు . ఈ సందర్భంగా ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయా ? అని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా జగన్ సమాధానమిస్తూ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని ,ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని అన్నారు .

ఇంకా మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేశానని సీఎం చంద్రబాబుకు తెలుసని, అందుకే ఆయన మంచి చేస్తున్నవారిపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతూనే ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

అయినా వారిపై వేటు పడకుండా చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారని, వారితో రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. వారిని తిరిగి గెలిపించుకునే సత్తా లేకనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇని చేస్తున్న చంద్రబాబు చివరకు రాజ్యాంగం అపహస్యం అవుతుందని మాట్లాడతాడంటూ మండిపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments