తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రేమ కధా చిత్రాలలో ప్రత్యేకతను సంతరించుకున్న సినిమా ఏ మాయ చేశావే . దర్శకుడు గౌతమ్ మీనన్ అద్బుతంగా తెరకెక్కించిన ఈ సినిమా సినీ ప్రేక్షకులందరినీ అలరించింది . ఈ సినిమాతోనే అటు నాగచైతన్యకు , ఇటు సమంతకూ తమ కెరీర్ టర్న్ అయ్యింది . ఇదే చిత్రం తమిళంలో సింబు , త్రిష కాంబినేషన్లో వచ్చిన విషయం తెలిసినదే . ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ చేయటానికి గౌతమ్ మీనన్ ఆలోచిస్తునట్టు సమాచారం .  ఈ విషయమై సింబు ను సంప్రదించగా ఆయన అంగీకరించినట్టు , ఇక తెలుగు సీక్వెల్ విషయంలో చైతూ అంగీకరించాల్సి ఉందని తెలుస్తోంది . అయితే ఇందులో కధానాయికల గురుంచి ఇంకా తెలియాల్సి ఉంది . మరి ఈ సీక్వెల్ కార్యరూపం దాల్చి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలాని ఆశిద్దాం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments