పవన్ పర్యటనలో అపశృతి …

530

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది . ఈ పర్యటనకు గాను ఫ్లెక్సీలు కడుతుండగా విద్యు దాఘాతానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు . ఈ దారుణం విశాఖ జిల్లా పాయకరావుపేట లో చోటుచేసుకుంది . వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ నేడు పాయకరావుపేట లో పర్యటించనున్నారు , తమ అభిమాన హీరో రాకను పురస్కరించుకొని తునికి చెందిన తోళెం నాగరాజు , పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో పాయకరావుపేటలో విషాదం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here