తాము చేసినది చిన్న సహాయమైనా సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు బోలెడంత పబ్లిసిటీ ఇచ్చుకునే ఈ రోజులలో ఎటువంటి హడావిడీ పెద్ద ఎత్తున సహాయం చేశారు తమిళ్ స్టార్ హీరో విజయ్ . వివరాలలోకి వెళితే ఇటీవల తూతుక్కుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలనే ఉద్యమంలో కొంత మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినదే . ఇప్పటికే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ నుండి చాలా మంది నుండి తూతుక్కుడి ప్రజలకు మద్దత్హు లభిస్తోంది .

అయితే తాజాగా హీరో విజయ్ కూడా తూతుక్కుడి వెళ్ళారు , అయితే ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా వెళ్లి అంతే సైలెంట్ గా వచ్చేసారు . మంగళవారం రాత్రి ఆయన తూతుక్కుడి కి బైక్ పై చేరుకొని బాడిత కుటుంబాలతో మాట్లాడి వారికి రూ . లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందించారు . మళ్ళీ తిరిగి అదే బైక్ పై చెన్నై వెళ్ళిపోయారు . ఇప్పుడు ఆయన తూతుక్కుడి లో బైక్ పై తిరుగుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి . ఈ ఫోటోలను చూసి నేతిజేన్లు విజయ్ ను రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments