తన వైవిధ్యమైన నటనతో తెలుగు , తమిళ బాషలలో మంచి పేరు సంపాదించుకున్న హీరో సందీప్ కిషన్ . ఆయన నటనకు మంచి మార్కులు పడుతున్నా , ఆయన సినిమాలు మాత్రం హిట్ అవ్వడంలేదు . దీనితో చాలా కాలం నుండి ఆయన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు . ఈ కారణంగానే ఆయన కొంత సమయం తీసుకొని ఇప్పుడు ఒక విభిన్నమైన కధతో మన ముందకు రాబోతున్నారు  .

అసలు విషయం ఏమిటంటే తాను ఎప్పుడు చేయని హారర్ నేపధ్యంలో సినిమా చేయడానికి సందీప్ కిషన్ సిద్ధమయ్యారట . ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా తెలుగు , తమిళ్ బాషలలో ఏకకాలంలో రూపొందుతోంది . ఈ సినిమాలో సందీప్ కు జోడీగా బాలీవుడ్ నటి అన్య సింగ్ నటిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here