హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ పేరుతో కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఛాలెంజ్ ప్రారంభించిన విషయం తెలిసినదే . దీనితో దేశంలోని ప్రముఖులు అందరూ తమ ఫిట్నెస్ వీడియో లను పోస్ట్ చేసి కొంతమందికి ఈ ఛాలెంజ్ విసురుతున్నారు . ఇటీవలే కేరళ సూపర్ స్టార్ మొహన్ లాల్ విసిరినా సవాలును అందుకుంటూ యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ కూడా ఒక వ్యాయమ వీడియో పోస్ట్ చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరినా విషయం తెలిసినదే . అయితే తాజాగా రామ్ చరణ్ తన ఫిట్నెస్ వీడియో ను తన ఫేస్బుక్ అకౌంట్ లో షేర్ చేస్తూ ‘‘హాయ్ ఎన్టీఆర్ బ్రదర్.. నీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. అంతేకాదు నేను కూడా సుకుమార్, కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు), అబు జానీ సందీప్ కోస్లా, శోభన కామినేని, వరుణ్ తేజ్ మరియు మన మెగాస్టార్‌కు ఈ ఛాలెంజ్ విసురుతున్నాను..’’ అని పోస్ట్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here