రజనీకాంత్ ముఖ్యపాత్రలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా కాలా . రజనీకాంత్ కావేరీ నదీ జలాలపై స్పందించిన తీరు విషయంలో ఈ సమయంలో కాలాను కర్ణాటక లో విడుదల కానివ్వమని ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపిన విషయం తెలిసినదే . అయితే తాజా కాలా సినిమా విడుదలకు సహకరించాలంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కు కన్నడ భాషలో ఒక సందేశం పంపారు . ఈ సందేశంలో సినిమా విడుదలయ్యే ధియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరారు .

అంతకముందుగా కావేరీ జలాల వివాదంలో కాలా సినిమాను కర్ణాటక ఫిలిం ఛాంబర్ నిషేదించి ఈ విషయం పై హై కోర్టుకు వెళ్ళింది . అయితే విచారణ జరిపిన కోర్టు తాము విడుదలను అడ్డుకోలేమని క్లియరెన్స్ ఇచ్చింది . థియేటర్ల వద్ద భద్రతను కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపింది. ఈ తీర్పుపై కుమారస్వామి స్పందిస్తూ, కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడమే మంచిదని నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు సూచిస్తున్నానని తెలిపారు. ఒక కన్నడిగుడిగా తాను చెబుతున్నానని… ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదలైతే, అనవసరమైన వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. పరిస్థితులు కొంచెం చక్కబడ్డాక విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలకు సహకరించాలంటూ సందేశం పంపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments