జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఈ విషాద వార్త తన మనసుని కలచివేసిందని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

“టీ నాగరాజు, బీ శివల మరణం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన వారి కుటింబీకులు ఎంత వేదన కలిగిస్తుందో అర్థం చేసుకోగలను. మృత్యువాత పడిన వారి కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శిస్తాను. జనసేన పార్టీ ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుంది” అని పవన్‌ పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments