జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకు ఏజెన్సీ సందర్శించారు . అక్కడ ఉన్న స్థానికులు ఘనంగా పవన్ కు స్వాగతం పలికారు . ఏజెన్సీలో ఉన్న పవన్ అక్కడి గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ముఖ్యంగా గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి కరిగిపోయారు. వైద్యం అందక వారు పడుతున్న కష్టాలపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
ఈ విషయం పై గిరిజనులు స్పందిస్తూ ఇప్పటి వరకూ ఏ నాయకుడు తమ ఊరికి వచ్చినా కనీసం వారి కష్టసుఖాలు అడగలేదని కానీ ఈ బాబు వచ్చి అన్నీ కూలంకుశంగా అడిగి తెలుసుకున్నారని , ఆయన తప్పకుండా మేలుచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు స్పందిస్తూ ఇప్పటి వరకు తమ గ్రామానికి ఒక్కడు కూడా రాలేదని , ఈ మహానుభావుడు వచ్చాడని , దండం పెడుతున్నానని ఆవేశంగా మాట్లాడారు . ఇంకా మాట్లాడుతూ పవన్ ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు .