టీడీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే కొనకళ్ళ నారాయణ ఈరోజు మీడియాతో మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ వైసేపీ ఎంపీల రాజీనామాలవల్ల ఏపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు . జూన్ 4వ తేదీకి ముందే రాజీనామాలను ఆమోదింపచేసుకుని ఉంటే చిత్తశుద్ధి తెలిసేదని అన్నారు. రాజీనామాలవల్ల ప్రత్యేక హోదా రావాలని, ఉప ఎన్నికలు రావాలని, ఎన్నికలు జరిగితే వారికి ప్రజల్లో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. ఇప్పుడు వారు రాజీనామాలు ఆమోదింప చేసుకున్నా ఉప ఎన్నికలు రావని, వైసీపీ రాజీనామాలంతా ఓ డ్రామా అని తాము ముందు నుంచి చెబుతున్నామని అన్నారు. వారు రాజీనామాలు చేసి రెండు నెలలు అయిందని, ఇంతవరకు వారు ఎందుకు రాజీనామాలను ఆమోదింపచేసుకోలేదని నారాయణ ప్రశ్నించారు. 2015 నుంచి రాజీనామాల డ్రామా ఆడుతున్నారని, వాళ్లకు చిత్తశుద్ది ఉంటే ఆనాడు రాజీనామాలు చేసుంటే.. వాళ్ల నిజాయితీని గౌరవించేవాళ్లమని నారాయణ పేర్కొన్నారు.
ఎంపీల రాజీనామాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు …
Subscribe
Login
0 Comments