కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రెండు వారాలకు ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరిగింది . కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీతో జరిపిన చర్చల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చింది . ఈ చర్చలలో కాంగ్రెస్ 22 , జేడీఎస్ కు 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇరుపార్టీల అధిష్టాన వర్గాలు అంగీకరించాయి . కాకపోతే కేవలం కాంగ్రెస్ నుండి 14 మంది , జేడీఎస్ నుండి 7 గురు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు . గవర్నర్ వాజుభాయి వాలా రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించారు .

డీకే శివకుమార్ కు సాగునీరు , వైద్య విద్య అప్పగించారు . కాంగ్రెస్ కు హోంశాఖ , జీడీఎస్ కు ఆర్ధిక శాఖ ఇచ్చారు . ఇక్కడ విశేషం ఏమిటంటే ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు .కేజీపీ ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి దక్కింది . మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో డీకే శివకుమార్, రేవణ్ణ, దేశ్‌పాండే, బండెప్ప కాశంపూర్, జీటీ దేవెగౌడ, కేజే జార్జి, డీసీ తమ్మణ్ణ ఉన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments