తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం కర్ణాటక లో విడుదలకు హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కన్నడ సంఘాలు మాత్రం కాలా విడుదలకు అభ్యంతరాలు చెప్తున్న విషయం తెలిసినదే . ఈ నేపధ్యంలో ప్రముఖ తమిళ్ అగ్రహీరో , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత స్పందించారు . ఈ విషయంలో ఆయన రజనీకాంత్ కు మద్దతిస్తూ గతంలో తన చిత్రం విశ్వరూపం ను కర్ణాటకలో నిషేదించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు . ఇంకా మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ఫిలిం చాంబర్స్ ఈ మేరకు చర్చలు జరపాలని సూచించారు . కర్ణాటకలో చాలా మంది రజనీకాంత్ అభిమానులు కాలా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు . రైతులకు సంబంధించిన అంశాలపై ఏ విధంగా అయితే చర్చలు అవసరమో , అదే విధంగా సినిమాల విషయంలోనూ చర్చలు అవసరమన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments