ఆంధ్రప్రదేశ్ రాష్ర ఉపముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి పై ప్రతిపక్షం వ్యక్తిగత దూషణలకు దిగుతున్న విషయం తెలిసినదే . ఈ విషయం పై కే ఈ కృష్ణమూర్తి స్పందించారు . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరణతోనే తాను రాజకీయంగా ఎదిగానని , ధైర్యం ఉంటె తనతో , తన కుటుంబంతో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు . తనపై వ్యక్తిగత దూషణలకు దిగడం ఇక మానాలన్నారు . ఈ సందర్భంగా  వైసీపీ ఎంపీల రాజీనామాల గురుంచి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా ఓ నాటకమని అన్నారు . వైసీపీ , బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే రాజీనామాలు ఇప్పటి వరకు ఆమోదం కాలేదని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments