కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతోందని దానికి సంకేతం గానే బెంగళూరులో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం వేదికపై చంద్రబాబు , రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసినదే . అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి ఘాటుగా స్పందించారు . ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని , ఒకవేళ అదే జరిగితే తాను ఉరి వేసుకోవడానికి సిద్ధమని అన్నారు . ఇంకా మాట్లాడుతూ పొత్తు పై నిర్ణయం తన వ్యక్తిగతం మాత్రమే కాదని టీడీపీ తరపున చెప్తున్నానన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments