కాలా కోసం సెలవు ప్రకటించిన ఐటీ సంస్థ …

528

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . కేవలం తమిళ ప్రేక్షకులే కాక తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ తో పాటు ఇతర దేశస్తులు కూడా రజనీ సినిమా కోసం వేచి చూస్తుంటారు . ఇప్పుడు తాజా రజనీకాంత్ నటించిన కాలా జూన్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది . దీంతో చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి సినిమా చూసే ప్లాన్ లో ఉన్నారు . ఇదే విషయాన్ని గ్రహించిన కేరళలోని “టెలిసియస్ టెక్నాలజీ ” అనే ఇటీ సంస్థ యాజమాన్యం తమ సిబ్బందికి రేపు సెలవును ప్రకటించింది . దీనితో సిబ్బంది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .ఉద్యోగుల ఆనందానికి అడ్డుపడడం ఇష్టం లేక సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట . అయితే ఈ విధంగా సెలవు ప్రకటించడం నిజమేనాని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు చెప్తున్నారు . తమ సంస్థ పబ్లిసిటీ కోసం ఇదంతా చేయలేదని , రజనీ సినిమా పట్ల ఉద్యోగుల్లో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకుందని ఉద్యోగులు స్పష్టం చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here