మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఏపీ ముఖ్యంన్త్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నారని , తానెప్పుడైతే బీజీపీ తో విబేధించానో అప్పటి నుండి యూటర్న్ తీసుకున్నారని అన్నారు . తనను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని , తనతో సహా మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీలు ఎవ్వరినీ వదలడం లేదని , ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు .

జగన్ గురుంచి మాట్లాడుతూ వైసీపీ చీఫ్ ఇంకా మరో అడుగు ముందుకు వేసి కులాలు , మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు . ఎవరెన్ని కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు . రాష్ట్రానికి వైసీపీ , బీజేపీ కలిసి చేస్తున్న ద్రోహానికి ప్రజలంతా కసితీరా ఓట్లు వేసి వారికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments