అదేదో సినిమాలో నటుడు సునీల్ “నాన్నా నేను బంకు , పెళ్ళికూతురు జంపు” అని అనడం చూసాం . ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే తమిళనాడులోని కడలూరు జిల్లా బనృట్టి గ్రామానికి చెందిన పూలవ్యాపారి అళగేశన్ కు సోమకోట గ్రామానికి చెందిన రంజితంతో వివాహం నిశ్చయమైంది . అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి జూన్ 4 వ తేదీన వివాహం జరగవలసి ఉంది . పెళ్ళికి బంధువులు అందరూ చేరుకున్నారు . కానీ తీరా ముహూర్త సమయానికి పెళ్ళికూతురు అదృశ్యమైంది . ఆమె కోసం ఎంత వెతికినా జాడ తెలియలేదు . దీంతో , అప్పటికప్పుడు బంధువుల అమ్మాయితో ఆ వరుడికి పెళ్లి జరిపించేశారు . ఆ తర్వాత పెళ్లికుమార్తె అదృశ్యంపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయిందా? లేక ప్రేమ కోణం ఏదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments