జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మధ్య కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది . ఇటీవల పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర లో భాగంగా విజయనగరం లో మాట్లాడుతూ “అశోక్ గారు … నేనేనండి పవన్ కళ్యాణ్ ” అంటూ తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లు వ్యంగ్యాస్త్రాన్ని విసిరారు . ఇంకా తాను 2014 ఎన్నికలలో ఎటువంటి పాత్ర పోషించాను అనేదానిపై మాట్లాడారు . ఈ నేపధ్యంలో మళ్ళీ అశోక్ గజపతి రాజు పవన్ పై విమర్శలు చేశారు . ఆయన మాట్లాడుతూ రిసార్ట్ లో దీక్ష చేస్తే ఎవరికీ లాభమని ప్రశ్నించారు . రాజకీయాలపై పవన్ మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments