అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ తన చిన్ననాటే సిసింద్రీ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు . చాలా కాలం గ్యాప్ తరువాత హీరో గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు సినిమాలలో హీరోగా నటించారు . అయితే ఆ రెండు సినిమాలు బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి . అయినా కూడా ఆయనకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు . దాంతో అఖిల్ బ్రాంక్ వాల్యూ ఒక రేంజ్ లో ఉంది . ఈ యువ మన్మధుడు ఇటీవల హైదరాబాద్ లో ఓ జిమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారట . ఈ కార్యక్రమంలో అఖిల్ కేవలం పావుగంట మాత్రమె ఉన్నారు , కానీ ఆయన ఎంత మేరకు వసూలు చేశారో తెలుసా ? అక్షరాల రూ . 8 లక్షలు . అఖిల్ హీరో అవ్వకముందే మౌంటైన్ డ్యూ , టైటాన్ వాచ్ లకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు . ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అఖిల్ కు ఫాలోవర్లు కూడా ఎక్కువే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments