సామాన్యంగా మనం టాలీవుడ్ అగ్రహీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపించడం చూస్తుంటాం . కానీ ఇక్కడ ఆలా కాదు , ఎందుకంటే ఇక్కడ ఫ్రేమ్ లో ఉన్నది టాలీవుడ్ అగ్ర దర్శకులు . దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు . అసలు విషయం ఏమిటంటే నిన్న రాత్రి వంశీ ఇంట్లో జరిగిన పార్టీ కి ఈ ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు . వంశీ ఈ ఫోటోను షేర్ చేస్తూ “అద్బుతమైన వ్యక్తులతో మరచిపోలేని సాయంత్రం గడిపాను ” అని క్యాప్షన్ పెట్టారు . ఈ చిత్రంలో రాజమౌళి , సుకుమార్ , క్రిష్ , కొరటాల శివ , హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి , నాగ్ అశ్విన్ , సందీప్ వంగవీటి , వంశీ పైడిపల్లి ఉన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments