సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి డిల్లీలో మీడియాతో సమావేశమయ్యారు . ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు . ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని నష్ట పరిచే విధంగా ఉన్నాయన్నారు . ఇంకా మాట్లాడుతూ మోదీ పాలనకు వ్యతిరేకంగా ఆగష్టు 1 వ తీదీ నుంచి వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు . దేశాన్ని , రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సెప్టెంబర్ , అక్టోబర్ లలో జాతీయ యాత్రలు చేపడతామని , అక్టోబర్ లో డిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments