పవన్ , చిరంజీవి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి…

0
227

ఈమధ్య కాలంలో కాస్టింగ్ కోచ్ వివాదం తో తెరమీదకు వచ్చారు శ్రిరెడ్డి . తాజాగా ఆమె తన ఫేస్బుక్ ఎకౌంటు ద్వారా నార లోకేష్ కు సపోర్ట్ గా , పవన్ , చిరంజీవి కు వ్యతిరేఖంగా  పోస్ట్ చేశారు .  “నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవారు ఎవరూ లేరు . కొత్త పార్టీ ఏం చేస్తుందో అని చెప్పుకోండి . అంతే .. విమర్శలు చేస్తే ఒప్పుకునేది లేదు . నా నోటికి పని చెప్పొద్దు” అని పోస్ట్ పెట్టారు . ఆపై మరో పోస్ట్ పెడుతూ “జగన్ అన్నలా ఓర్పు మీకెక్కడ ఉంది ? జగన్ అన్న ఫ్యామిలీ లక్షల మందికి చేసిన సహాయాలు ఎవరూ మర్చిపోలేదు . సినిమా డైలాగు కొట్టి , వాటర్ తాగినంత ఈజీ కాదు . మీ అన్నయ్య రాజకీయాలు , మీ అన్న సినిమాల్లో ఎంతమందిని తోక్కాడో ఎవరికీ తెలీదు  . మా అసోసియేషన్లో కార్డు , పీకే గారి మీద గౌరవంతో నాకు కార్డు ఇవ్వనివ్వటంలేదు . మీ చలవే కదా” అంటూ చెప్పుకొచ్చింది .

ఆపై మరో పోస్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే పోస్ట్ పెట్టినట్టు స్పష్టమైనది .  . “మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తరువాత, 5 సంవత్సరాల్లో కేవలం ఒకే ఒక్కసారి తిరుపతికి వచ్చారని, వాళ్లకోసం సింగిల్ పైనా ఖర్చు పెట్టలేదని, ఎక్కడా కూడా తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడలేదని, తిరుపతి ప్రజల ఉవాచ. చంద్రబాబుగారు తిరుపతికి తీసుకొచ్చి ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకొని తప్పు పని చేయొద్దని మనవి” అని ఇంకో పోస్టు పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here