ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగతనేత వై ఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తూ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర తలపెట్టి నేటికి సరిగ్గా ఆరు నెలలు . ఈ పాదయాత్రలో జగన్ జనంతో మమేకమై వారి సమస్యలను కూలంకుషంగా తెలుసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు .  ఇడుపులపాయ నుండి మొదలైన ఈ పాదయాత్ర వై ఎస్ ఆర్ కడప , కర్నూల్ , అనంతపురం , చిత్తూరు , నెల్లూరు , ప్రకాశం , గుంటూరు , కృష్ణా మీదుగా ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కొనసాగుతోంది . ఇప్పటివరకు జగన్ దాదాపు 2,250 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు . ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరధం పట్టారు . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రజసంకల్పపాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రజలు చూపిస్తున్న ప్రేమే కారణమని , పేరు పేరునా ప్రతి ఒక్కరికీ తన హృదయ పూర్వక వందనాలు తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments