ఉపాసనకు చెర్రీ స్పెషల్ గిఫ్ట్ …

0
194

మెగా కపుల్‌ చెర్రీ , ఉపాసన ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. అయితే మెగా అభిమానులు మాత్రం చెర్రీ అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తారు. మెగా అభిమానులకు చెర్రీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ మెగా అభిమానులకు దగ్గరయ్యారు ఉపాసన. మిస్టర్‌ సి అంటూ సంబోధిస్తూ.. చెర్రీకి సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారు.

సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్ దంపతుల కంటే మెగా కపుల్‌ సందడే ఎక్కువగా ఉంటుంది. తాజాగా చెర్రీ తన సతీమణి ఉపాసన కోసం షాపింగ్‌ చేసి ఫ్లవర్‌బొకే కొన్న విషయాన్ని తెలియజేశారు. ఎంతో జాగ్రత్తగా పూల బొకేను పట్టుకున్న చెర్రీ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here