జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకులో ఉన్న పవన్ అక్కడి గిరిజిన యువతతో సమావేశమయ్యి అక్కడి సమస్యల గురుంచి అడిగి తెలుసుకున్నారు . అక్కడ ఉన్న ఆసుపత్రి సదుపాయాలు , మహిళల స్థితిగతులపై చర్చించారు . ఈ సందర్భంగా పవన్ తన భార్య ప్రసవ సమయంలో తాను పడిన ఆందోళన గురుంచి చెప్పుకొచ్చారు . తన భార్యకు ప్రసవ సమయం రావడంతో ఎందుకైనా మంచిదని ఓ డ్రైవర్ను , ఐదుగురు సిబ్బందిని రెడీగా పెట్టానని , కానీ వారు సమయానికి అందుబాటులో లేకుండా పోవడంతో తానే స్వయంగా కారు నడుపుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని గుర్తు చేసుకున్నారు . ఆ సమయంలో తాను పడిన ఆందోళన అంతా ఇంతా కాదన్నారు .

నగరంలో ఉండే తన పరిస్థితే అలా ఉంటే , ఇక గిరిజన ప్రాంతాలలో గర్భిణుల పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు . అందుకే వారికి కూడా సదుపాయాలూ కల్పించాలని ఆ సంఘటన సమయంలోనే నిర్ణయించుకున్నానని తెలిపారు . పవన్ అక్కడ ఉన్న యువతతో తాను ఓట్ల కోసం రాలేదని , వారి వెంట తాను ఎప్పుడు ఉంటానని హామీ ఇచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments