ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం …

667

చాలా సంవత్సరాల తరువాత కింగ్ అక్కినేని నాగార్జున , రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఆఫీసర్ . ఈ సినిమా విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ సంపాదించుకొని డిజాస్టర్ గా నిలుస్తోంది . అయితే తాజాగా ఈ చిత్ర పంపిణీదారుడు తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమంటున్నారు . ఇండియా టుడే కధనం మేరకు ఆఫీసర్ చిత్రీకరణ సమయంలో దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ , సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి కోటీ ముప్పై లక్షల రూపాయల ఫైనాన్సు తీసుకున్నారు .

అయితే సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత కూడా సుబ్రమణ్యానికి డబ్బు చెల్లించకపోగా ఈ విషయంపై కోర్టుకు వెళ్ళాలంటూ వర్మ సూచించారు . కోర్టులో చాలా సమయం పడుతుందన్న ఉద్దేశంతో తనకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా ఆఫీసర్ చిత్రం గోదావరి రైట్స్ ను ఇవ్వవలసినదిగా కోరారు సుబ్రహ్మణ్యం . అయితే వర్మ మాత్రం కేవలం గోదావరి జిల్లాల హక్కులు ఇచ్చేది లేదని , అంధ్ర రైట్స్ మొత్తం తీసుకోవాల్సిందిగా సూచించారు .

దీనితో తనకు మరో అవకాశం లేని పరిస్థితిలో సుబ్రహ్మణ్యం మూడున్నర కోట్లు చెల్లించి మొత్తం అంధ్ర హక్కులు సొంతం చేసుకున్నారు . కానీ సినిమా విడుదలై దిజాస్టార్ టాక్ రావడంతో మినిమం కలెక్షన్లు కూడా రాక భారీ నష్టాలు తప్పేలా లేవు . నాగార్జున సినిమా కనుక మంచి లాభాలు వస్తాయని భావించిన తనకు ఇప్పుడు ఆత్మహత్యే శరణ‍్యం అంటున్నారు సుబ్రమణ్యం. మరి ఈ వివాదంపై నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మలు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here