ప్రజలు తరిమి కొడతారు …

475

గుంటూరు జిల్లా వినుకొండలో టీడీపీ నవనిర్మాణ దీక్ష జరిగింది . ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు ఓపిక పట్టారని , కానీ కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని వ్యాఖ్యానించారు . చివరకు తిరుమల శ్రీవారిని కూడా అభాసుపాలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు . తెలుగు ప్రజలంటే కేంద్రానికి ఎందుకంత చిన్న చూపు ? అని ఘాటుగా ప్రశ్నించారు .

ఇంకా మాట్లాడుతూ ఏపీపై విపక్ష చూపిస్తే పరజలు తరిమి తరిమి కొడతారని లోకేష్ హెచ్చరించారు . ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని, అలాగే ప్రతిపక్షాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నాయని, అందుకే ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here