ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి , వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఏపీ సీఎం చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆవిడ మాట్లాడుతూ చంద్రబాబు గారికి ఎవరైతే ఇప్పటివరకు మిత్రులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజున ఆయన్ని అసహ్యించుకొనే పరిస్థితి వచ్చింది . దీని బట్టీ చూస్తే ఆయన పరిస్థితి ఏంటనేది తెలుస్తోంది . ఇంకా మాట్లాడుతూ నిన్నటి వరకు బీజేపీ చంద్రబాబుతో ఉన్నారు , అలాంటిది అదే బీజేపీ ఈరోజున బాబు పై కారాలు మిరియాలు నూరుతోంది , ఈ కారాలు మిరియాలు నూరే బదులు చంద్రబాబు చేసిన అవినీతిపై ఒక ఎంక్వయిరీ వేయమని అడుగుతున్నామన్నారు . ఆ ఎంక్వయిరీ తో చంద్రబాబు పాపపు సొమ్ములు మొత్తం , బినామీ ఆస్తులు , ఇన్నేళ్ళూ ఏపీ ప్రజలను లూఠీ చేసి సంపాదించిన సొమ్ము బయటకు వస్తుందని అన్నారు .
చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ చేయాలి …
Subscribe
Login
0 Comments