మే 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు వేడుక జరుపుకున్న విషయం తెలిసినదే . ఎన్టీఆర్ కి రిస్ట్ వాచీలంటే ఇష్టం ఉండడంతో ఈ సందర్భంగా తన అన్న కళ్యాణ్ రామ్ ఒక ఖరీదైన రిస్ట్ వాచ్ ను కానుకగా ఇచ్చారట . తన అన్న ప్రేమతో ఇచ్చిన వాచీ ని ఎన్టీఆర్ ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారట . అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది . గతంలో ఎన్టీఆర్ హీరోగా “జై లవ కుశ” సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మించిన విషయం తెలిసినదే . మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఆసించడంతో కళ్యాణ్ రామ్ ఈ విషయం పై ఆలోచిస్తునట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments