రానా హీరోయిన్ ఫిక్స్ …

521

విభిన్నమైన కధలను , విలక్షణమైన పాత్రలనూ ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు హీరో రానా . ఆయాన తాజాగా త్రిభాషా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసినదే . ఈ చిత్రానికి “హాధీ మేరే సాధీ” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు . ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు , తమిళ బాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు .

తెలుగు లో ఈ సినిమాకు “అరణ్య” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు . ఈ సినిమాలో రానా కు జోడీగా బాలీవుడ్ నటి “కల్కి కొచ్లిన్” నటిస్తున్నారు . ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఆగస్టు నుంచి ప్లాన్ చేశారు. అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని రానా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here