తొలిప్రేమ సినిమా విజయంతో మంచి జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఘాజీ సినిమాకు దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసినదే . ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు . దీనికోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ జరుపుతున్నారు . అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త తెలుస్తోంది . ఈ చిత్రానికి అంతరిక్షం అనే టైటిల్ వైపు చిత్రబృందం మొగ్గుచూపి ఆ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్టు సమాచారం . ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన కధానాయికలుగా లావణ్య త్రిపాఠి , అదితిరావు హైద్రై నటిస్తున్నారు . ఇప్పటికే ఫిదా , తొలిప్రేమ విజయాలతో ఉన్న వరుణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments