ఎన్బీకే ఫిలిమ్స్ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొండుతున్న విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ చిత్రబృందం కొత్త నటీ నటులకు అవకాశం కల్పిస్తోంది , దీనికి సంబంధించి ఒక ప్రకటనను నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఎకౌంటు లో పోస్ట్ చేసింది .”నటిస్తూ తెరమీద కనబడుతూ జీవించాలనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కానీ మంచి అవకాశాలు రానివారు కొందరు.. అలాంటి వారికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం” అంటూ ఆ సినిమా యూనిట్‌ ఓ ప్రకటన చేసింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ప్రాముఖ్యత గల కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారు రెండు ఫొటోలు పంపాలని, అలాగే స్మార్ట్‌ఫోన్‌లో తమ నటన ఏపాటిదో చూపెడుతూ 30 సెకన్లకు మించకుడా ఓ వీడియో తీసి casting.ntrbiopic@gmail.com కు మెయిల్‌ చేయాలని కోరింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments